ఉరవకొండ: బూదివర్తి గ్రామంలో పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమం
అనంతపురం జిల్లా బెళుగుప్ప మండల పరిధిలోని బూదివర్తి గ్రామంలో గురువారం పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమాన్ని మండల తహసిల్దార్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పౌరహక్కుల దినోత్సవ కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మీనారాయణ, హెడ్ కానిస్టేబుల్ శివశంకర్ నాయక్, గ్రామ మహిళా సంఘాల సభ్యులతో కలసి అంబేద్కర్ కాలనీ వాసులకు పౌర హక్కులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ చట్టాలపై, ప్రజలకు అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించాలని చదువు అత్యంత ప్రాముఖ్యమని వివరించారు. ఎస్సీ ఎస్టీ లకు చెందిన వారు అన్యాయానికి గురైతే పోలీసులను ఆశ్రయించాలని చట్టాలను ఉల్లంఘించారాదని సూచించారు.