మార్కాపురం: జిల్లా కేంద్రంలోని శిరిడి సాయిబాబా మందిరంలో వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం
మార్కాపురం జిల్లా కేంద్రంలోని నెహ్రూ బజారులో వెలిసిన శిరిడి సాయిబాబా మందిరం సమీపంలో విగ్నేశ్వర సేవ సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ కార్యదర్శి హరిహరరావు మాట్లాడుతూ గత 27 సంవత్సరాలుగా సేవా సంఘం ఆధ్వర్యంలో విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. దాతల సహకారంతో ఈ సంవత్సరం వివిధ ప్రాంతాలలో 20 విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. హిందూ సోదరులు వినాయక విగ్రహాలు పెట్టడమే కాదు భక్తిశ్రద్ధలతో రాష్ట్రంలోని ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఘనంగా పూజలు జరిపించాలన్నారు.