కనిగిరి: కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక వైసీపీ నేతల విమర్శలు: డిజి పేటలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి సుధ
చంద్రశేఖరపురం : గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్చుకోలేక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, వైసిపి నాయకులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని టిడిపి రాష్ట్ర కార్యదర్శి, కనిగిరి నియోజకవర్గ టిడిపి రాష్ట్ర పరిశీలకు రాలు సుధ విమర్శించారు. చంద్రశేఖరపురం మండలంలోని డీజీ పేట, ఉప్పలపాడు గ్రామాల్లో ఎన్డీఏ కోటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన, అభివృద్ధి మరియు సంక్షేమంపై ఆమె శనివారం ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని ఆమె సూచించారు.