మార్కాపురం: జిల్లా కేంద్రంలోని కొండేపల్లి గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా ఉండడంతో వాహనదారులు ఇబ్బందులకు
మార్కాపురం నుండి కొండేపల్లి కి వెళ్లే రహదారి అధ్వాన స్థితిలో ఉంది. ఈ రహదారిలో వందల సంఖ్యలో ఆటోలు వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రధాన రోడ్లో పెద్ద గుంతక ఏర్పడి అందులో వర్షపు నీరు నిలిచి బురదగా మారింది. వాహనదారులు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సగం రోడ్డుకు పైగా నీటి గుంత ఉండడంతో తరచుగా వెళ్లే వాహనదారులు ఎక్కడ కింద పడిపోతామోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.