గిద్దలూరు: కంభం పట్టణంలో కార్డెన్ సర్చ్ నిర్వహించి సరైన ధ్రువపత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలకు జరిమాన విధించిన పోలీసులు
మార్కాపురం జిల్లా కంభం పట్టణంలోని పూసల బజారు, ఓల్డ్ షుగర్ ఫ్యాక్టరీ, ఫైర్ స్టేషన్ ఏరియా ప్రాంతాలలో పోలీసులు కార్డెన్సర్చ్ నిర్వహించారు. దాదాపు 70 మంది పోలీసు సిబ్బందితో ఏకకాలంలో స్థానిక ఇళ్లను తనిఖీలు నిర్వహించిన పోలీసులు సరైన ధ్రువపత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలను గుర్తించి జరిమానాలు విధించారు. అలానే మత్తు పదార్థాలు, గంజాయి వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యకలాపాలను చెక్ పెట్టేందుకు ఇన్ ఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో కార్డెన్ సర్చ్ నిర్వహించినట్లు కంభం సర్కిల్ సీఐ మల్లికార్జున తెలిపారు.