సంతనూతలపాడు: చీమకుర్తిలో అంతరాయం లేని విద్యుత్ సరఫరాకు చర్యలు: విద్యుత్ శాఖ ఈఈ హరిబాబు
చీమకుర్తి పట్టణంలో అంతరాయం లేని విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ ఈ ఈ హరిబాబు తెలిపారు. చీమకుర్తిలో నూతనంగా ఏర్పాటుచేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను విద్యుత్ శాఖ అధికారులతో కలిసి హరిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చీమకుర్తి పట్టణంలోని అన్ని వార్డుల్లో ఎక్కడ విద్యుత్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని, విద్యుత్ లో వోల్టేజీ సమస్యలు ఉన్నచోట్ల అదనపు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడైనా లో వోల్టేజ్ సమస్యలు ఉంటే సిబ్బంది దృష్టికి తీసుకువస్తే, అక్కడ అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తామన్నారు.