దర్శి: దర్శి మండలం చందలూరులోని బొప్పాయి పంటను పరిశీలించిన దర్శి టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ లక్ష్మి
Darsi, Prakasam | Apr 12, 2025 ఇటీవల వీచిన గాలులకు దర్శి మండలం చందలూరులోని బొప్పాయి పంట నేలమట్టమయింది. శనివారం దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ లక్ష్మి పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వ్యవసాయ అధికారులు వెంటనే పంట నష్టాలు అంచనాలు వేసి జిల్లా కలెక్టర్కు నివేదిక పంపాలని ఆమె కోరారు. గాలివానకు నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.