గిద్దలూరు: కొమరోలు మండలం రెడ్డిచర్ల గ్రామంలో కార్డెన్ సర్చ్ నిర్వహించి 20 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్న స్థానిక పోలీసులు
మార్కాపురం జిల్లా కొమరోలు మండలం రెడ్డి చర్ల ఎస్సీ పాలెం లో సీఐ రామకోటయ్య, ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో శనివారం కార్డెన్ సర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రామకోటయ్య తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో కార్డెన్ సర్చ్ నిర్వహించామని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసినట్టు సీఐ వెల్లడించారు. దాదాపు 70 పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.