ఉరవకొండ: నక్కలపల్లి లో నిర్వహించిన గురు పౌర్ణమి వేడుకల్లో ఆకట్టుకున్న కోలాటం నృత్యాలు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని నక్కలపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా కడప జిల్లా లింగాల మండలం లింగమయ్య గురువు ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాటం నృత్యాలు ఆకట్టుకున్నాయి. యువతులు వివిధ పాటలకు వేసిన కోలాటం నృత్యాలు అలరించాయి. ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తజనం పాల్గొన్నారు.