ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురంలో భారీ అగ్నిప్రమాదం: ప్లాస్టిక్ గోదాముతో పాటు మరొక షాపు దగ్ధం
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని దాసన్నపేటలో ఉన్న రామకృష్ణ ప్లాస్టిక్ గోదాములో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పక్కనే ఉన్న మేఘన లేడీస్ కార్నర్ షాపుకు కూడా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. అధికారులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.