ఇచ్ఛాపురం: కంచిలి మండలం వరహాలు గడ్డ సమీప జాతీయ రహదారిపై వాటర్ ట్యాంకర్ కు వెనుక నుంచి ఢీకొన్న లారీ క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం వరహాలుగెడ్డ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం 2:30 గంటలకు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారికి మధ్యలో ఉన్న మొక్కలకు నీరు పోస్తున్న వాటర్ ట్యాంకర్ కు వెనుక నుంచి ఓ లారీ అతి వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కొని ఆహాకారాలు చేశాడు. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అతి కష్టంగా క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ ను బయటకు తీసి, చికిత్స నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.