ఇచ్ఛాపురం: కంచిలి మండలంలోని అన్ని గ్రామ సచివాలయాల పరిధిలో ఉన్న వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
కంచిలి మండలంలోని అన్ని గ్రామ సచివాలయాల పరిధిలో ఉన్న వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. తమపై టీడీపీ, జనసేన నాయకులు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు తామంతా రాజీనామాకు చేశామని తెలిపారు. వాలంటీర్లపై తప్పుడు ప్రచారం చేస్తున్న రెండు పార్టీల నాయకులకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. రాజీనామా పత్రాలను ఎంపీడీవో నీరజకు అందజేశారు.