జడ్చర్ల: కుచ్చరక్కల్ గ్రామంలో కుక్కల దాడిలో 15 మేక పిల్లలు మృతి, మల్లయ్యకు ఆర్థికసాయం అందించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజపూర్ మండలంలోని కుచ్చరక్కల్ గ్రామంలో 15 మేక పిల్లలు కుక్కల దాడిలో మృతి చెందాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి బుధవారం గ్రామానికి చేరుకొని బాధిత రైతు మల్లయ్య గారిని పరామర్శించారు. వెంటనే రూ. 25,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.