బచ్చన్నపేట: బచ్చన్నపేట మండల కేంద్రంలో ఫెర్టిలైజర్ షాప్ ను అలాగే పిహెచ్సి ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
ఈరోజు బచ్చన్నపేట మండల కేంద్రంలో ఫెర్టిలైజర్ షాపులను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు పలు రికార్డులను పరిశీలించిన అనంతరం ఎవరు కూడా రైతులను మోసగించవద్దని ఎవరైనా రైతులకు నకిలీ పురుగుమందులు అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు సీజనల్ వ్యాధుల పట్ల ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు