రాప్తాడు: జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని ఎస్కే యూనివర్సిటీ వద్ద పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థినీలు ధర్నా నిర్వహించారు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయం నందు గురువారం 12 గంటల 35 నిమిషాల సమయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు శివ,చంద్ర ఆధ్వర్యంలో శాంతియుత ధర్నా కార్యక్రమాన్ని ఎస్కే యూనివర్సిటీ ప్రధాన ముక్కు దారం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా శివ చంద్ర తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయాలని లేకుంటే పెద్ద ఎత్తున పోటీ పరీక్షలు సిద్ధమయ్యే అందర్నీ కలుపుకొని ఆందోళన చేపడతామని ఎస్కే యూనివర్సిటీ వద్ద పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న శివ, చంద్ర తదితరులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.