రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతన్నా మీ కోసం కార్యక్రమంలో అనంతపురం జిల్లాలో 2.75 లక్షల రైతు కుటుంబాలలో సర్వే చేశామని జిల్లా వ్యవసాయాధికారిని ఉమామహేశ్వరమ్మ తెలియజేశారు. బుధవారం రాయదుర్గంలో ఆమె మాట్లాడుతూ గత నెల 24 నుంచి 29 వరకూ అన్ని రైతు సేవాకేంద్రాల పరిధిలో చేసిన సర్వే ఆధారంగా బుధవారం జిల్లా అంతటా కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసినట్లు తెలిపారు. మండల స్థాయి, జిల్లా స్థాయి ప్రణాళిక కూడా తయారు చేస్తామని ప్రకటించారు. ఈ ప్రక్రియ మెత్తం ఆన్ లైన్ లో నమోదు చేయబడుతుందని ప్రకటించారు.