మార్కాపురం: వెలుగొండ ప్రాజెక్టు కృష్ణా జలాలు చూడడానికి వచ్చిన సందర్శకులతో సందడిగా మారిన గొట్టిపడియా డ్యాం
మార్కాపురం మండలం గొట్టిపడియా డ్యాం దగ్గర సందర్శకులు బారులు తీరారు. వెలుగొండ ప్రాజెక్టు కు కృష్ణా జలాలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. డ్యామ్ లో రోజురోజుకు నీటి శాతం పెరుగుతుండడంతో సందర్శకుల తాకిడి ఎక్కువ అయిపోయింది. ఈ ప్రాంతంలో ఎన్నడు ఇంత పెద్ద ఎత్తున నీరు చూడలేదని ఈ ప్రాంతానికి వెలుగొండ ప్రాజెక్టు ఒక వరమని సందర్శకులు చెప్తున్నారు. సెల్ఫీలు తీసుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.