ఉరవకొండ: బెలుగుప్ప నక్కలపల్లి గ్రామాల మధ్య సమీప పొలాల్లో నీటి కుంటలో పడి వ్యక్తి మృతి
అనంతపురం జిల్లా బెలుగుప్ప గ్రామానికి చెందిన బోయ శివ ( 41) ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి మృతి చెందిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. . పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలు మేరకు మృతుడు శివ కాసరకాయలు తీసుకువచ్చి అమ్మేవాడని, 20వ తేదీ చిన్న కాకరకాయలు కోసం గ్రామ సమీపలోని పోలాల్లోకి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని, 25వ తేదీ శనివారం మండల పరిధిలోని నక్కలపల్లి గ్రామ పొలంలో ఉన్న నీటి గుంతలోకి నీరు త్రాగడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి, ఈత రాకపోవడం పోవడంతో మృతి చెందాడన్నారు, మృతుడు కుమారుడు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.