మార్కాపురం: పింఛన్ దరఖాస్తుల గడువు పెంచాలని ఆర్డీవో కు విజ్ఞప్తి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మహబూబ్ వలి
పెన్షన్ గడువును పెంచాలని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ మహబూబ్ వలి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మార్కాపురం ఆర్డీవో వెంకట శివరామిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 7 నుండి 16వ తేదీ వరకు పింఛన్ కు అవకాశం కల్పించారన్నారు. కానీ మధ్యలో సెలవులు వచ్చాయని, దీంతో లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా పది రోజుల పాటు గడువును పెంచాలని కోరారు.