దర్శి: ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామంలో కందుల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన దర్శి టిడిపి ఇన్చార్జి లక్ష్మి
రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. శుక్రవారం ముండ్లమూరు మండలం పసుపుగల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు. రైతులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కొనుగోలు కేంద్రంలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.