దర్శి: దొనకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహణ
దొనకొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పాఠశాల ప్రిన్సిపల్ రామాంజనేయులు ఆధ్వర్యంలో బుధవారం స్పోర్ట్స్ అండ్ ఎన్సిసి వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడలలో మరియు ఎన్సిసి లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు.ప్రిన్సిపాల్ రామాంజనేయులు మాట్లాడుతూ.. మునుముందు జాతీయస్థాయిలో క్రీడా పోటీలలో ప్రతిభ కనబరచాలని కోరారు.