దర్శి: దర్శి పట్టణంలోని అన్న క్యాంటీన్ కు 61 లక్షల నిధులు మంజూరు : దర్శి టిడిపి ఇన్చార్జి లక్ష్మి
దర్శి మండల కేంద్రంలో ఉన్న అన్న క్యాంటీన్ కు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 61 లక్షల నిధులను మంజూరు చేసినట్లు దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి బుధవారం తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కనిగిరిలో జరిగిన సీబీజీ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి నారా లోకేష్ ముఖ్య అతిథిగా విచ్చేయగా ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి దర్శి నియోజకవర్గం లో అన్నా క్యాంటీన్ కు సంబంధించి నిధులు మంజూరు చేయాలని కోరగా వెంటనే స్పందించిన ఆయన నిధులను మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు.