కొండపి: కొండపి మండలం అనకర్లపూడిలో భూముల రీసర్వేపై తహశీల్దార్ మురళీ ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహణ
కొండపి మండలం అనకర్లపూడిలో భూముల రీసర్వేపై తహశీల్దార్ మురళీ ఆధ్వర్యంలో గ్రామంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించి,అనంతరం గ్రామసభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ.. రీసర్వే జరిగే సమయంలో రైతులు తమ భూములకు సంబంధించిన డాక్యుమెంట్స్, ఆధార్, ఫోన్ నంబర్, ఫోటో తీసుకువచ్చి భూముల గట్లు చూపించాలని విజ్ఞప్తి చేశారు. చనిపోయిన పట్టాదారుల వారసులు కుటుంబాలు భాగ పంపిణీ చేసుకొని వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని సూచించారు.