మార్కాపురం: వెలుగొండ ప్రాజెక్టు పునరావస కాలనీలను పరిశీలించిన జేసీ శ్రీనివాసులు
మార్కాపురం మండలం వెలిగొండ ప్రాజెక్టు పునరావస కాలనీలను జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న మౌలిక వసతులు అభివృద్ధి పనులను పరిశీలించి పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. శరవేగంగా పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో డిఆర్ఓ వెంకట శివరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.