ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని అంబేద్కర్ ఆడిటోరియం నందు డి ఆర్ డి ఏ వెలుగు శాఖ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంబంధిత డిపార్ట్మెంట్ పరిధిలో వడ్డీ లేని రుణాలను అందజేసి వారి అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ప్రతి ఒక్కరికి రుణాలు అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి నారాయణ తదితరులు పాల్గొన్నారు.