రాప్తాడు: రాప్తాడు నియోజకవర్గం లో మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమీ లేదు అనంతపురంలో ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాప్ కార్యాలయంలో గురువారం 12 గంటల పది నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ప్రజలకు వివరించేందుకు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాప్తాడు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది అని డోర్ టు డోర్ కార్యక్రమంలో ప్రజలకు వివరించేందుకు ప్రత్యేక పాంప్లెట్లను ముద్రించి పంపిణీ చేయబోతున్నాం అన్నారు గత వైసిపి పాలలో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఎక్కడ అభివృద్ధి చేయలేదని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు