కొండపి: పొన్నలూరు మండల కేంద్రానికి సమీపంలో కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా,పలువురికి స్వల్ప గాయాలు
పొన్నలూరు మండల కేంద్రానికి సమీపంలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కందుకూరు నుంచి పొన్నలూరు వైపుకు వస్తున్న ట్రక్ ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలోని 35 మంది కూలీలకు స్వల్పగాయలయ్యాయి. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం, అతివేగమే కారణమని స్థానికులు తెలిపారు.