తాడిపత్రి: కిష్టిపాడు సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్ ఉన్న దిమ్మెను ఢీకొన్న కారు, తృటిలో తప్పిన పెను ప్రమాదం
పెద్దవడుగూరు మండలం కిష్టిపాడు సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపుతప్పి పెట్రోల్ బంక్ సిమెంట్ దిమ్మెకు ఢీకొనింది. ప్రమాదంలో జరిగిన వెంటనే కారులో మంటలు చెలిరేగాయి. పెట్రోల్ బంక్ సిబ్బంది, కారు డ్రైవర్ నాగరాజు అప్రమత్తమై మంటలను ఆర్పారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.