కనిగిరి: చంద్రశేఖరపురం మండలం ఉప్పలపాడు సమీపంలో విద్యుత్ షాక్ తగిలి ట్రాలీ లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి
చంద్రశేఖరపురం: విద్యుత్ షాక్ తగిలి ట్రాలీ లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చంద్రశేఖరపురం మండలం ఉప్పలపాడు గ్రామ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చంద్రశేఖరపురం మండలంలో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనుల్లో భాగంగా ట్రాలీ లారీపై ఎక్స్ కవేటర్ వాహనాన్ని ఎక్కించుకొని వెళ్తున్న గ్రామంలో ఉప్పలపాడు గ్రామ శివారులో ఎక్స్ కవేటర్ కు 3 ఫేజ్ విద్యుత్ తీగలు తగిలాయి. విద్యుత్ తీగలు తగలడంతో ట్రాలీ లారీ డ్రైవర్ ఎం వెంకటసుబ్బయ్య విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.