గార్ల: ఇల్లందు, మహబూబాబాద్లకు సీతారామ ప్రాజెక్ట్ నీరు: క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యేలు
ఇల్లందు, మహబూబాబాద్, డోర్నకల్ ప్రాంతాలకు సాగు, త్రాగునీరు అందించేందుకు చీమలపాడు వద్ద సీతారామ ప్రాజెక్ట్ లిఫ్ట్ ఏర్పాటును ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, భుక్యా మురళీ నాయక్ పరిశీలించారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో త్వరలోనే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే కనకయ్య తెలిపారు.