దర్శి: దర్శిపట్నంలోని స్థానిక కురిచేడు రోడ్డులో ఎన్ఎస్పి మంచినీటి పైపులైనుకు రంధ్రం.. మరమ్మత్తులను చేపట్టిన అధికారులు
దర్శిపట్నంలోని స్థానిక కురిచేడు రోడ్డులో ఎన్ఎస్పి మంచినీటి పైపులైనుకు రంధ్రం ఏర్పడి మంచినీరు వృధాగా పోతున్న నేపథ్యంలో సోమవారం ఎన్ఎస్పి మరియు ఇరిగేషన్ అధికారులు స్పందించి మరమ్మత్తు పనులను చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఎన్ఎస్సి మంచినీటి పైపులైనుకు రంధ్రం ఏర్పడడంతో మరమ్మతులు చేసేందుకు రెండు రోజులు సమయం పడుతుందని కావున కొన్ని ప్రాంతాలకు మంచినీటి సరఫరా నిలిచిపోనున్నాయని, కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని వారు కోరారు.