కనిగిరి: పట్టణంలో 52 మంది లబ్ధిదారులకు రూ.32 లక్షలు విలువచేసే CMRF చెక్కులను పంపిణీ చేసిన కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నందు ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదివారం లబ్ధిదారులకు సీఎం చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 52 మంది లబ్ధిదారులకు రూ.32 లక్షలు విలువ చేసే చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పేదలను ఆదుకోవడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆపద సమయాల్లో కార్పొరేట్ వైద్యశాలలో వైద్యం చేయించుకున్న రోగులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా సీఎం చంద్రబాబు ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నారన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు .