ఉరవకొండ: శ్రీనివాస విద్యానికేతన్ మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశంలో పాల్గొన్న అధికారులు
అనంతపురంజిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలో గల శ్రీ శ్రీనివాస విద్యానికేతన్ పాఠశాల నందు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు పేరెంట్స్ మరియు టీచర్స్ సమావేశం- 4.0 ను పాఠశాలలో శనివారం హెచ్ ఎం సుమ, కరస్పాండెంట్ శ్రీనివాసుఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎం.ఈ.ఓ -1 గోవిందరాజులు, ఎంఈఓ 2 హరికృష్ణ, టిడిపి జిల్లా కార్యదర్శి మల్లికార్జున, విశ్రాంత ఉపాధ్యాయులు పర్వతన్న, ఎస్సై శివ, పిల్లల తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థులు ప్రస్తుత సమాజంలో ఎలా బాధ్యతగా చదువుకోవాలి, చదువు విషయంలో వారి తల్లిదండ్రుల పాత్రను గురించి వివరించారు.