కనిగిరి: దేశ సమగ్రతను ప్రతి ఒక్కరూ ఐక్యంగా కాపాడుకోవాలి: పట్టణంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు జీవీ కొండారెడ్డి
కనిగిరి: దేశ సమగ్రతను ఐక్యంగా కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని ప్రకాశం జిల్లా సిపిఎం పార్టీ కార్యవర్గ సభ్యులు జేవి కొండారెడ్డి సూచించారు. కనిగిరిలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం జరిగిన దేశ సమగ్రతకు మతసామరస్యం అనే అంశంపై సదస్సులో ఆయన మాట్లాడారు. పహాల్గాంలో అమాయకులైన పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి దుర్మార్గమన్నారు. దాడి చేసిన ఉగ్రవాదులను అదుపులోకి తీసుకోవడంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉగ్రవాదుల అణిచివేత పేరుతో ముస్లింలను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. మతసామరస్యాన్ని కాపాడుకుంటూ, దేశ సమగ్రతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు.