కనిగిరి: గ్రామాల అభివృద్ధి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం: కంచర్లవారిపల్లి, లింగారెడ్డిపల్లి లో టిడిపి రాష్ట్ర కార్యదర్శి సుధ
కనిగిరి మండలంలోని కంచర్ల వారి పల్లి, లింగారెడ్డిపల్లి గ్రామాల్లో టిడిపి రాష్ట్ర కార్యదర్శి, కనిగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు సుధ టిడిపి నాయకులతో కలిసి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన, అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను ఆమె పంపిణీ చేశారు. గ్రామాల అభివృద్ధి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని సుధ తెలిపారు. కనిగిరి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి మౌలిక వసతుల కల్పన కోసం సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులు చేపట్టారన్నారు. టిడిపికి ప్రజలు అండగా నిలవాలన్నారు.