కొండపి: పొన్నలూరు మండలం రావులకొల్లు గ్రామంలో దుగ్గిరాల ఈశ్వరమ్మ అనే మహిళా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకు
పొన్నలూరు మండలం రావులకొల్లు గ్రామంలో దుగ్గిరాల ఈశ్వరమ్మ (38) ఆదివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త మల్లికార్జునకు ఈశ్వరమ్మకు కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఎస్ఐ అనూక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు.