రాప్తాడు: రాష్ట్రంలో వర్షాలు కురవాలని వరుణ యాగం నిర్వహిస్తున్నాం పంపునూరులో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపునూరు గ్రామంలో సోమవారం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సుబ్రమణ్య స్వామి వారి ఆలయంలో వరునయాగాని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పంపునూరులో సుబ్రహ్మణ్యస్వామి వారికి వెయ్యి బిందెలతో అభిషేకాలు నిర్వహించి వర్షాలు కురవాలని వరుణ్ యాగం కూడా నిర్వహించడం జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.