కనిగిరి: పామూరులో తమను ఎస్సీ జాబితాలో చేర్చాలని బీసీ డెడికేషన్ కమిటీ చైర్మన్ రాజీవ్ రంగన్ మిశ్రా కు రజక, వడ్డెర, వాల్మీకుల వినతి
పామూరు: బీసీల స్థితిగతులు, రాజకీయ రిజర్వేషన్ అంశాలపై ప్రభుత్వం నియమించిన రాజీవ్ రంగన్ మిశ్రా కమిటీ సోమవారం పామూరు పట్టణంలో పర్యటించింది ఈ సందర్భంగా వడ్డెర, రజక, వాల్మీకి సంఘాల నాయకులు కమిటీ చైర్మన్ రాజీవ్ రంగన్ మిశ్రా ను కలిసి తమను ఎస్సీ జాబితాలో చేర్చాలని వినతి పత్రాన్ని సమర్పించారు. అదేవిధంగా ఈ కులాలకు చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ఈ కులాలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేయాలని వారు వినతి పత్రంలో కోరారు