కనిగిరి: పట్టణంలోని పామూరు బస్టాండ్ సెంటర్లో అగ్ని ప్రమాదం, స్థానికులు, సిబ్బంది సహకారంతో మంటలను అదుపు చేసిన సీఐ శ్రీనివాసులు
కనిగిరి పట్టణంలోని పామూరు బస్టాండ్ సెంటర్ వద్ద బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పామూరు బస్టాండ్ వద్ద తోపుడు బండిపై టిఫిన్ తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. వెంటనే స్పందించిన స్థానిక సీఐ శ్రీనివాసులు పోలీస్ సిబ్బంది మరియు స్థానికులతో కలిసి మంటలను అదుపు చేశారు. వేసవిలో అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తోపుడుబండ్లపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న వారికి సిఐ సూచించారు. గ్యాస్ వంటి వాటితో వంటలు తయారు చేసేటప్పుడు మరింత అప్రమత్తత అవసరమని సీఐ అన్నారు.