రాప్తాడు: ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు నిధులు దోచుకుంటున్నాడు అనంతపురంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోమవారం 11 గంటల 50 నిమిషాల సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల పేరుతో నిధులు దోచుకోవడం తప్ప ఏ ప్రాజెక్టుకు కనీసం డిపిఓ కూడా చేయించలేదు, నందమూరి తారకరామారావు డిపిఓ చేయిస్తే నారా చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు పేరు చెప్పి దోచుకోవడమే ప్రధాన అజెండాగా చంద్రబాబు నాయుడు వేలకోట్ల రూపాయలు దోచుకున్నాడు తప్ప రైతులకు ఏ మేలు చేయలేదని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు.