నేలకొండపల్లి: మురసు తుఫాను ఎఫెక్ట్: నేలమట్టమైన వరి పంట, ఆదుకోవాలని కోరుతున్న రైతు
మురసు తుఫాను కారణంగా నేలకొండపల్లి మండలం మంగాపురం తండాలో రైతు భూక్య రాజశేఖర్ సాగు చేసిన రెండు ఎకరాల వరి పంట దెబ్బతింది. పెట్టుబడులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతు, ప్రభుత్వం మరియు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.