కనిగిరి: మహానాడు కార్యక్రమంలో టీడీపీ శ్రేణుల హాజరు శాతాన్ని పెంచాలి: వెలిగండ్లలో కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
వెలిగండ్లలో టిడిపి వర్చువల్ గా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టిడిపి ప్రతిష్టాత్మకంగా ప్రతి క్లస్టర్ పరిధిలో మహానాడు కార్యక్రమాన్ని రెండు రోజులపాటు నిర్వహిస్తుందని, మొదటిరోజు హాజరు శాతం తక్కువగా ఉందని,. రెండవ రోజు 28వ తేదీ గురువారం టిడిపి మహానాడు కార్యక్రమంలో సందర్భంగా కేఎస్ఎస్ సభ్యులు , మరియు టిడిపి శ్రేణుల హాజరు శాతాన్ని ఆన్లైన్ ద్వారా భారీగా నమోదయ్యే విధంగా పార్టీ నాయకులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు.