ఉరవకొండ: పంటల బీమా నమోదు గడువును ఆగస్టు 15 వరకు పొడిగించాలి : వైయస్సార్సీపి పిఎసి సభ్యులు విశ్వేశ్వర్ రెడ్డి
పంటల బీమా నమోదు గడువును ఆగస్టు 15 వరకు పొడిగించాలని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు వై. విశ్వేశ్వర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగంటిపోతుండగా, నదులు, చెరువులు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల బోర్లు ఎండిపోవడంతో ట్యాంకర్ల ద్వారా చెట్లకు నీరు అందించే పరిస్థితి నెలకొందని, అనంతపురం జిల్లాలో నీటి కొరత లేకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. పంటల బీమా ప్రీమియం చెల్లింపుకు గడువును పెంచాలన్నారు.