రాప్తాడు: రాప్తాడు ఆత్మకూరు అనంతపురం రూరల్ లో ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే కార్యక్రమాన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో శుక్రవారం ఉదయం ఏడున్నర గంటల నుంచి 11 గంటల వరకు ఆత్మకూరు కనగానపల్లి అనంతపురం రూరల్ చెన్నై కొత్తపల్లి రామగిరి మండల కేంద్రాల్లో ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే కార్యక్రమాన్ని సిపిఐ సిపిఎం సిఐటియు ఏఐటిసి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సావిత్రి సిపిఎం ఆత్మకూరు మండల కార్యదర్శి శివ శంకర తదితరులు మాట్లాడుతూ ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని వామపక్ష పార్టీ నేతలు పేర్కొన్నారు.