సంతనూతలపాడు: ఈనెల 15వ తేదీన జరిగే మండల సర్వసభ్య సమావేశానికి సమగ్ర సమాచారంతో అధికారులు హాజరు కావాలి: సంతనూతలపాడు ఎంపీడీవో సురేష్ బాబు
సంతనూతలపాడు ఎంపీడీవో కార్యాలయంలో ఈనెల 15వ తేదీ బుధవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరుగుతుందని సంతనూతలపాడు ఎంపీడీవో సురేష్ బాబు మంగళవారం తెలిపారు. సమావేశానికి సంబంధించి ఇప్పటికే మండలంలోని అన్ని శాఖల అధికారులకు సర్కులర్ జారీ చేశామన్నారు. సర్కులర్ అందుకున్న అధికారులు సమగ్ర సమాచారంతో మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరుకావాలని ఎంపీడీవో సూచించారు. అదేవిధంగా జడ్పిటిసి, ఎంపీటీసీ సభ్యులు కూడా తప్పనిసరిగా సమావేశానికి హాజరు కావాలన్నారు.