కనిగిరి: అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి టిడిపి శ్రేణులు భారీగా తరలిరావాలి: పామూరులో ఏఎంసీ చైర్మన్ రమా శ్రీనివాస్
పామూరు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కనిగిరిలో ఈనెల 6న శనివారం ఘనంగా జరుగుతుందని కనిగిరి ఏఎంసీ చైర్మన్ యారవ రమా శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం పామూరు టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పామూరు మండలంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలన్నారు. శనివారం ఉదయం 10 గంటలకు కనిగిరిలో భారీ ర్యాలీ కార్యక్రమం జరుగుతుందని, అనంతరం కేంద్ర ,రాష్ట్ర మంత్రులతో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందన్నారు. టిడిపి శ్రేణులు భారీగా తరలివరావ్వాలని పిలుపునిచ్చారు.