కనిగిరి: పట్టణంలోని కాశిరెడ్డి కాలనీలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
కనిగిరి: ఉరి వేసుకుని ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కనిగిరి పట్టణంలోని కాశిరెడ్డి కాలనీలో గురువారం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కనిగిరి పట్టణంలోని కాశిరెడ్డి కాలనీలో ఆటో డ్రైవర్ ఆంజనేయులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.