ఉరవకొండ: బెలుగుప్పలోని శాంతిదామంలో ఘనంగా శ్రీ ఎర్రితాత స్వామి ఆరాధన ఉత్సవాలు ప్రారంభం
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని శ్రీ ఎర్రితాత స్వామి ఆరాధన ఉత్సవాలు మంగళవారం సాయంత్రం ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయం వద్ద నాంది పూజ కార్యక్రమాలను ఆలయ సేవా కమిటీ సభ్యులు వేదపండితులతో కలిసి శాంతి ధామంలో ఆరాధన ఉత్సవాలు ప్రారంభించారు. ఆలయంలో గణపతి పూజ గోపూజ గంగపూజ ధ్వజారోహణం, స్వస్తి పుణ్యాహవాచనం, నంది వాహన సేవ పూజలు నిర్వహించారు. బుధవారం ప్రభోత్సవ ఊరేగింపు, గురువారం ఉట్ల పరుస కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ సేవా కమిటీ సభ్యులు పేర్కొన్నారు.