ఉరవకొండ: బెళుగుప్ప మండల రాజకీయ పార్టీల బిఎల్ఎ లకు SIR (స్పెషల్ ఇంటెన్స్ రివిజన్) పై అవగాహన కార్యక్రమం
గౌరవ జిల్లా కలెక్టర్ అనంతపురం మరియు ERO ఉరవకొండ నియోజకవర్గం వారి ఆదేశాలతో ఓటరు జాబితాలపై SIR (స్పెషల్ ఇంటెన్స్ రివిజన్) పై గురువారం అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని వాసవి కళ్యాణ మండపం నందు అన్ని రాజకీయ పార్టీలు BLA (బూత్ లెవెల్ ఏజెంట్) లకు ఎస్ ఐ ఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమం నందు డిప్యూటీ తహసీల్దార్ గురుబ్రహ్మ, ఎంపీడీఓ లక్ష్మీనారాయణ సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం పై అవగాహన కల్పించారు.