ఉరవకొండ: బెలుగుప్ప మండలంలో'' సర్ ' ఓటరు పరిశీలన ప్రక్రియలో 85.01 శాతం డిజిటలైజేషన్ పూర్తి : తహసిల్దార్ అనిల్ కుమార్
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలోని స్థానిక గ్రామ సచివాలయం నందు రాజకీయ పార్టీల ప్రతినిధులతో, పొలిటికల్ పార్టీ బి ఎల్ ఏ లతో తహసిల్దార్ అనిల్ కుమార్ శనివారం సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఇందులో రాజకీయ నాయకులు బి ఎల్ ఏ లతో చర్చించిన అంశాలలో మండలంలో ఎస్ ఐ ఆర్ మీద ఎన్యూమరేషన్ ఫారాలు 36,682 పంపిణీ చేయగా, 31,185 డిజిటలైజేషన్ చేయడం జరిగిందని. శనివారం రిపోర్టు మేరకు 85.01 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో సహాయ ఓటరు నమోదు అధికారులు, రాజకీయ పార్టీ ప్రజా ప్రతినిధులు టిడిపి కన్వీనర్ సునీల్ నాయకులు మల్లికార్జున, పెద్ద తిప్పయ్య బిఎల్ఎలు పాల్గొన్నారు.